Posts

Showing posts from October, 2025

Echoes- మాయమైన సంతోషం

Image
మా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న భవాని నిన్న సాయంత్రం వచ్చి రాఖీ కట్టింది, గిఫ్ట్‌గా తనకు సల్మాన్ రష్దీ రాసిన "మిడ్‌నైట్స్ చిల్రన్" నవల ఇచ్చాను. "థ్యాంక్స్. నాకో ఫేవర్ చేస్తావా?" అని అడిగింది. ఒక్క క్షణం ఆలోచించి "ప్రామిస్ చేయలేను" అన్నాను. తను చిన్నగా నవ్వి "నా కథ చెప్తా, రాస్తావా?" అంది. ఏ మాత్రం ఆలోచించకుండా "ష్యూర్" అని పాజ్‌లో ఉన్న "డార్క్ డిజైర్" సీజన్ టూ సిరీస్ అఫ్ చేసేసాను. భవానీ చెప్పటం మొదలు పెట్టింది. **** మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. కిరణ్ ఓ కన్స్‌ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్. నేను సాప్ట్‌వేర్ కంపెనీలో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాను. మా ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్ళికి నాలుగు నెలల గ్యాప్ ఉండడంతో ఒకరినొకరు అర్ధం చేసుకునే అవకాశం దొరికింది. మొదట్లో అతని దగ్గర నాకు లోపాలేం కనిపించలేదు. కానీ పెళ్లయిపోయాక ఒకే కప్పు కింద కలిసి బ్రతకటం మొదలుపెట్టాక ఒకరి లోపాలు ఇంకొకరికి కనిపించసాగాయి. అతను పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి నేను ఆరింటికే లేవాల్సి వచ్చేది, చాలా చిరాకు అనిపించేది. మొదట్లో బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే రెడీ చేసే దాన్ని, కొన్...